Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మెగా చేతుల మీదుగా 'సుందరం మాస్టర్' ట్రైలర్ రిలీజ్!

Sundaram Master Trailer Released
Advertisement
  • వైవా హర్ష హీరోగా 'సుందరం మాస్టర్'
  • ఫారెస్టు నేపథ్యంలో నడిచే కథ 
  • ఒక వైపున కామెడీ .. మరో వైపున సస్పెన్స్ 
  • ఈ నెల 23వ తేదీన ఈ సినిమా విడుదల

Advertisement
కమెడియన్ గా వైవా హర్ష తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. 'సుందరం మాస్టర్' సినిమాతో ఆయన హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకి హీరో రవితేజ ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. దర్శకుడిగా కల్యాణ్ సంతోష్ పరిచయమవుతున్నాడు. కొంతసేపటి క్రితం ఈ సినిమా ట్రైలర్ మెగాస్టార్ చేతుల మీదుగా విడుదలైంది. 

అడవి ప్రాంతంలోకి ఒక గిరిజన గూడెంలోని ప్రజలకు ఆంగ్లం నేర్పించమని హీరోను ఆ ప్రాంతానికి పంపిస్తారు. అక్కడి వారికి తనకంటే మంచి ఇంగ్లిష్ వచ్చని తెలిసి హీరో ఆశ్చర్యపోతాడు. అసలు తనని పంపించింది మాస్టర్ గా కాదనీ, అక్కడ దాగిన ఒక రహస్యాన్ని కనిపెట్టడం కోసమని హీరోకి తెలుస్తుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? అనేదే కథ.ఫస్టాఫ్ అంతా కామెడీగా .. సెకండాఫ్ అంతా సీరియస్ గా .. సస్పెన్స్ తో ఈ కథ నడుస్తుందనే విషయం ఈ ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. దివ్య శ్రీపాద .. హర్షవర్ధన్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నెల 23వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Advertisement
Advertisement
Vaiva Harsha
Divya Sripada
Kalyan Santhosh

More Telugu News